తెలంగాణ‌లో రేపు స‌ర్కారీ కార్యాల‌యాలు, విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు

ts government states that tomorrow is a holiday
  • రేపు తెలంగాణ స‌మైక్య‌తా దినం 
  • సెల‌వు ప్ర‌క‌టించాల‌న్న సీఎం కేసీఆర్‌
  • కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసిన సీఎస్‌
తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారం (సెప్టెంబ‌ర్ 17)ను రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వు దినంగా ప్ర‌క‌టించింది. భార‌త దేశంలో హైద‌రాబాద్ విలీన‌మైన సంద‌ర్భాన్ని తెలంగాణ స‌మైక్య‌తా దినోత్స‌వం పేరిట రేపు టీఆర్ఎస్ స‌ర్కారు భారీ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 17ను సెల‌వు దినంగా ప్ర‌క‌టించాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ శ‌నివారాన్ని సెల‌వు దినంగా ప్ర‌క‌టిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. సీఎస్ అదేశాల‌తో రేపు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు మూత‌ప‌డ‌నున్నాయి.
Go Back to Shorts
Telangana
TRS
KCR
Somesh Kumar
Holi Day

More Telugu News