ఏఐజీ హాస్పిటల్ లో కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించిన అనుష్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏఐజీ హాస్పిటల్ లో కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించిన అనుష్క

Heroine Anushka condolence to Krishnam raju
  • రెబెల్ స్టార్ మరణంతో దిగ్భ్రాంతికి గురైన అనుష్క
  • మీ ఆత్మకు శాంతి చేకూరాలంటూ.. ట్విట్టర్ లో ట్వీట్
  • మా హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారన్న అరుంధతి
ప్రముఖ తెలుగు కథానాయిక అనుష్క శెట్టి.. కృష్ణంరాజు మరణంతో దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే ఏఐజీ హాస్పిటల్ కు చేరుకుని కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించింది.

ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబంతో అనుష్కకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. వారి కుటుంబ సభ్యురాలిగా మెలిగేది. ఆమె ప్రభాస్ కు మంచి ఫ్రెండ్ అని కృష్ణంరాజు కూడా ఓ సందర్భంలో చెప్పారు. అంత సన్నిహిత కుటుంబం నుంచి ఒకరు కాలం చేయడంతో అనుష్క కలత చెందింది. ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది.

కృష్ణంరాజు అనుష్కను తన కూతురి మాదిరిగా దగ్గరకు తీసుకోవడం ఆ ఫొటోలో కనిపిస్తోంది. ‘‘మాకు ఎంతో ఆత్మీయులైన కృష్ణంరాజు గారు మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. విశాల హృదయం కలిగిన ఓ దిగ్గజం మీరు .. మా హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు’’అంటూ నమస్కార ఎమోజీలను అనుష్క ట్వీట్ మాదిరి పెట్టింది.
Heroine
Anushka Shetty
condolence
Krishnam raju death
aig hospital

More Telugu News