'డ్రాకేరిస్' తో జాగ్రత్త... వాట్సాప్, యూట్యూబ్ లను మాయం చేస్తుంది: ఫేస్ బుక్ హెచ్చరిక
- కొత్త మాల్వేర్ పై అప్రమత్తం చేసిన ఫేస్ బుక్
- థర్డ్ పార్టీ యాప్ లను డౌన్ లోడ్ చేయొద్దని సూచన
- గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఉన్న యాప్ లనే ఇన్ స్టాల్ చేసుకోవాలని వెల్లడి
ముఖ్యంగా, గేమింగ్ యాప్ ల సాయంతో డ్రాకేరిస్ మాల్వేర్ ను స్మార్ట్ ఫోన్లలోకి చొప్పిస్తున్నారని ఫేస్ బుక్ పేర్కొంది. ఈ మాల్వేర్ ఫోన్ లోని యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను కూడా ఏమార్చగలదని వివరించింది. బిట్టర్ ఏపీటీ అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ మాల్వేర్ సృష్టికర్త అని వెల్లడించింది. యూజర్ అనుమతి లేకుండానే ఫోన్ లో ఏమైనా చేసేందుకు ఈ డ్రాకేరిస్ మాల్వేర్ దోహదపడుతుందని వివరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రొటెక్షన్ ఉన్న యాప్ లను మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలని, థర్డ్ పార్టీ ఏపీకే సైట్ల నుంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోరాదని ఫేస్ బుక్ స్పష్టం చేసింది.