పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ హన్సిక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ హన్సిక!

Is Hansika Motwani Getting Married
  • ప్రముఖ వ్యాపార వేత్తతో వివాహం అంటూ వార్తలు
  • గతంలో శింబుతో ప్రేమలో పడ్డ నటి
  • పెళ్లిదాకా వచ్చి విడిపోయిన శింబు, హన్సిక
‘దేశ ముదురు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టి దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటి హన్సిక మోత్వాని. ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. హన్సిక ఓ రాజకీయ నాయకుడి కుమారుడిని వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. అతను ప్రముఖ వ్యాపారవేత్త అని కూడా తెలుస్తోంది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

దాంతో, హన్సికకు కాబోయే భర్త ఎవరు? పెళ్లి ఎప్పుడు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఆమె అభిమానులు ఆత్రుతగా ఉన్నారు. కానీ, తన పెళ్లి వార్తలపై హన్సిక ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో వీటిని ఖండించనూ లేదు. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి ఇరు కుటుంబాలు త్వరలోనే ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. 

కాగా, హన్సిక పెళ్లి గురించి వార్తలు, పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. 2013లో తమిళ నటుడు శింబుతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత విభేదాలు రావడంతో  ఇద్దరూ విడిపోయారు. ఇక, హన్సిక ‘105 మినిట్స్’అనే సింగిల్ షాట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ మూవీలో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. దాన్ని హన్సిక పోషించింది. ఆమె పుట్టినరోజు కానుకగా బుధవారం ఓ పోస్టర్‌‌ విడుదలైంది.
hansika
actress
Tollywood
shimbu
busienssman

More Telugu News