మళ్లీ మేకప్ వేసుకోనున్న కాజల్ అగర్వాల్!
- కమలహాసన్ ఇండియన్ 2 తో ఎంట్రీ
- సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న షూటింగ్
- డెలివరీ తర్వాత ఆరు నెలలకే తిరిగి రానున్న కాజల్
మళ్లీ సినిమాల్లో నటించనున్నట్టు కాజల్ చేసిన ప్రకటన అభిమానులకు సంతోషాన్నిస్తోంది. 1996లో వచ్చిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్నదే ఇండియన్ 2. ఈ సినిమా 60 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కాజల్ అగర్వాల్ చివరిగా 'హే సినామిక' సినిమాలో నటించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె ఓ బాబుకు జన్మనివ్వడం తెలిసిందే.