బాలయ్య సెట్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్​

shruti haasan on balakrishna new movie sets
షార్ట్స్‌లో చూడండి
కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతిహాసన్ తక్కువ కాలంలోనే పవన్ కల్యాణ్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించి మంచి సక్సెస్ సాధించింది. కానీ, దాన్ని కొనసాగించలేక మధ్యలో డీలా పడింది. ఇప్పుడామె మళ్లీ టాలీవుడ్ పై ఫోకస్ పెంచింది. తెలుగులో తిరిగి తన హవా కొనసాగించాలని చూస్తోంది. 

ఈ క్రమంలో చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ సిమాలకు ఓకే చెప్పింది. బాబి దర్శకత్వంలో చిరంజీవికి జోడీగా ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రంలో, ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తోందామె. మొన్నటిదాకా ‘సలార్‌‌’ షూటింగ్ లో పాల్గొన్న శ్రుతి..  ప్రభాస్ కు బై చెప్పి బాలయ్యతో కలిసి నటించేందుకు రెడీ అయ్యింది. 

 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ 107వ చిత్రంలో శ్రుతీనే హీరోయిన్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్లోకి ఇప్పుడు శ్రుతి కూడా వచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపాడు.  

తన ఫేవరెట్ హీరోయిన్‌ సెట్స్‌కి వచ్చేసిందంటూ ఆమెతో దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. రవితేజ, శ్రుతి హీరో హీరోయిన్లుగా ‘క్రాక్‌’తో గోపీచంద్ మంచి హిట్ సాధించాడు. ఈ నేపథ్యంలో శ్రుతికి కొత్త సినిమాలో మంచి పాత్ర ఇచ్చాడట. మొన్నటిదాకా బాలకృష్ణతో యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరించిన దర్శకుడు తదుపరి షెడ్యూల్ లో బాలయ్య, శ్రుతిలపై సన్నివేశాలను చిత్రీకరించనున్నాడు. 

తన గత చిత్రాల మాదిరిగానే ఈ మూవీలోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఇందులో ఒకటి యంగ్ ఏజ్ లోని పాత్ర. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అలాగే, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 
Go Back to Shorts
Tollywood
Balakrishna
telugu
Shruti Haasan
gopichand malineni
Prabhas
salaar

More Telugu News