తమ పెళ్లి వేడుకకు సీఎం స్టాలిన్ ను ఆహ్వానించిన విఘ్నేశ్, నయనతార
- ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసిన ప్రేమ జంట
- పెళ్లికి రావాలంటూ ఆహ్వానం
- వీరి వెంట స్టాలిన్ కుమారుడు ఉదయనిధి
చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి జరగనున్నట్టు సమాచారం. తమ పెళ్లి గురించి నయనతార గతేడాదే బయటపెట్టడం తెలిసిందే. ఆమె చేతికి ఉంగరం ఉండడంతో ఓ టీవీ యాంకర్ ప్రశ్నించగా.. విఘ్నేశ్ శివన్ తో ఎంగేజ్ మెంట్ అయినట్టు ఆమె వెల్లడించింది. 'నానుమ్ రౌడీదాన్' సినిమా నుంచి విఘ్నేశ్, నయన్ మధ్య ప్రేమ నడుస్తోంది. ఈ జంట ఇటీవలే 'కాతు వాకుల రెండు కాదల్' సినిమాను చేసిన విషయం తెలిసిందే.