నిర్మాతలను చూసి ఏ ప్రేక్షకుడు సినిమాకి రాడు: అల్లు అరవింద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్మాతలను చూసి ఏ ప్రేక్షకుడు సినిమాకి రాడు: అల్లు అరవింద్

Allu Aravind attends Pakka Commercial movie press meet
  • గోపీచంద్, రాశీఖన్నా జంటగా 'పక్కా కమర్షియల్'
  • మారుతి దర్శకత్వంలో చిత్రం
  • హైదరాబాదులో ప్రెస్ మీట్
  • హాజరైన నిర్మాత అల్లు అరవింద్
గోపీచంద్ నటించిన 'పక్కా కమర్షియల్' చిత్రం ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమాకు ప్రేక్షకులను రప్పించే బాధ్యత ప్రధానంగా హీరోహీరోయిన్లే తీసుకోవాలని అన్నారు. నిర్మాతలను చూసి ఏ ప్రేక్షకుడు రాడని, హీరోహీరోయిన్లే తమ చిత్రం గురించి ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఇటీవల ఓ అగ్రహీరో వేదికపైనే డ్యాన్స్ చేశాడని, వారి సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసమే ఆ హీరో డ్యాన్స్ చేశాడని అల్లు అరవింద్ అన్నారు. అందుకే 'పక్కా కమర్షియల్' చిత్రంలో హీరోగా నటించిన గోపీచంద్ వస్తేనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని చిత్రయూనిట్ కు తాను స్పష్టం చేశానని అరవింద్ పేర్కొన్నారు.

'పక్కా కమర్షియల్' చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ నిర్మించాయి. మారుతి దర్శకత్వం వహించాడు.
Allu Aravind
Pakka Commercial
Press Meet
Gopichand
Raashi Khanna
Tollywood

More Telugu News