లక్షద్వీప్ తీరంలో డ్రగ్స్ కలకలం.. రూ. 1,526 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
- బోట్లలో తరలిస్తున్న హెరాయిన్‌ను పట్టుకున్న డీఆర్ఐ, ఐసీజీ
- ఆపరేషన్ ఖొజ్బీన్’ పేరుతో దాడులు
- కిలో చొప్పున ప్యాకెట్లుగా చేసి తరలిస్తున్న 218 కేజీల హెరాయిన్ పట్టివేత
- ఇంత భారీ ఎత్తున పట్టుబడడం గత రెండు నెలల్లో నాలుగోసారి
పట్టుబడిన హెరాయిన్ విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు 1,526 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పలువురు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, మాదక ద్రవ్యాలు తరలిస్తున్న బోట్లను కొచ్చికి తరలించారు. కాగా, దేశంలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం గత రెండు నెలల వ్యవధిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఏప్రిల్‌లో రూ. 26 వేల కోట్ల విలువ చేసే 3,800 కిలోలకు పైగా హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.