ఉత్సాహభరిత వాతావరణంలో 'శేఖర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్సాహభరిత వాతావరణంలో 'శేఖర్' ప్రీ రిలీజ్ ఈవెంట్

Sekhar pre release event in Hyderabad
  • రాజశేఖర్ హీరోగా 'శేఖర్' మూవీ
  • దర్శకత్వం వహించిన జీవిత
  • మే 20న రిలీజ్
  • నేడు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన 'శేఖర్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. భారీగా అభిమానులు తరలి రాగా, ఉత్సాహభరిత వాతావరణంలో ప్రీ రిలీజ్ వేడుక షురూ అయింది. మలయాళంలో వచ్చిన 'జోసెఫ్' చిత్రానికి రీమేక్ గా దీనిని నిర్మించారు. ఈ చిత్రానికి రాజశేఖర్ అర్ధాంగి జీవిత దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

బొగ్గరం వెంకట శ్రీనివాస్, బీరం సుధాకర్ రెడ్డిలతో పాటు రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఇందులో మలయాళ నటి ఆత్మీయ రాజన్ కథానాయిక. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పకుడు. టారస్ సినీ కార్ప్, పెగాసస్ సినీ కార్ప్, త్రిపుర క్రియేషన్స్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ బ్యానర్లపై ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇటీవలే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది.
Sekhar
Pre Release Event
Hyderabad
Rajasekhar
Jeevitha
Tollywood

More Telugu News