టాలీవుడ్ కి మలయాళ భామను పరిచయం చేస్తున్న 'శేఖర్'

Shekar movie update
తెలుగు తెరకి మొదటి నుంచి కూడా మలయాళ భామల తాకిడి ఎక్కువే. ఇక్కడ బాలీవుడ్ భామల జోరుకు బ్రేకులు వేసింది మలయాళ మందారాలే. అదే దారిలో ఇప్పుడు మరో మలయాళ భామ 'శేఖర్' సినిమాతో పరిచయమవుతోంది .. ఆ సుందరి పేరే ఆత్మీయ రాజన్. రాజశేఖర్ హీరోగా చేసిన ఈ సినిమా ఈ నెల 20వ తేదీన విడుదలవుతోంది.
 
జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో ఆ మధ్య వచ్చిన 'జోసెఫ్' సినిమాకి రీమేక్. ఆ సినిమాలో పాటలు ఉండవు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా చేసిన మార్పుల వల్ల ఇందులో పాటలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఆ సినిమాలో ఆత్మీయ రాజన్ పోషించిన పాత్రకిగాను, తెలుగులోను ఆమెనే తీసుకున్నారు.

ఇటీవలే  రాజశేఖర్ .. ఆత్మీయ రాజన్ పై చిత్రీకరించిన ఒక పాటను కూడా విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, శివాని రాజశేఖర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో చోటుచేసుకున్న అనూహ్యమైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
Go Back to Shorts
Rajasekhar
Muskan
Athmiya Rajan
Shekar Movie

More Telugu News