ఐపీఎల్ లో రబాడాకు అరుదైన రికార్డు
- ఐపీఎల్ లో 98 వికెట్ల మైలురాయికి చేరిక
- దక్షిణాఫ్రికా బౌలర్లలో అత్యధిక వికెట్లు అతడివే
- రెండో స్థానానికి దిగిపోయిన డేల్ స్టెన్
97 వికెట్లతో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న డేల్ స్టిన్ ను వెనక్కి నెట్టేశాడు. మిశ్చెల్ మార్ష్ వికెట్ తీయడంతో ఈ ఘనత సొంతమైంది. నిన్నటి మ్యాచ్ లో రబాడాకు ఈ ఒక్క వికెట్టే దక్కింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు చేజార్చుకుందని చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ కేవలం ఆరు విజయాలతో కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు దగ్గరైంది.