ఇన్ స్టాగ్రామ్ లో రవీంద్ర జడేజాను అన్ ఫాలో చేసిన చెన్నై సూపర్ కింగ్స్
- చెన్నై కెప్టెన్ గా వైదొలిగిన జడేజా
- సోషల్ మీడియాలో సీఎస్కేని అన్ ఫాలో చేసిన వైనం
- తాము కూడా అదే పనిచేసిన సీఎస్కే
ఐపీఎల్ తాజా సీజన్ లో జడేజా చెన్నై పగ్గాలు ధోనీ నుంచి స్వీకరించడం తెలిసిందే. కానీ వరుసగా మ్యాచ్ లు ఓడిపోవడంతో జడేజాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దాంతో జడేజా కెప్టెన్సీ వదులుకోగా, ధోనీనే మళ్లీ సారథిగా వచ్చాడు. అయితే, జడేజాను చెన్నై యాజమాన్యమే కెప్టెన్సీ నుంచి తప్పించినట్టు ప్రచారంలో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఆ ప్రచారం నిజమేనన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఏదేమైనా జడేజా, చెన్నై జట్ల మధ్య పదేళ్ల అనుబంధం ఈ విధంగా తెగిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.