సునీల్ శెట్టి కూతురి ప్రేమలో కేఎల్ రాహుల్.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇదే!
- అతియా శెట్టి, కేఎల్ రాహుల్ పెళ్లి ఈ ఏడాదే అంటూ వార్తలు
- ఈ వార్తల్లో నిజం లేదన్న అతియా సోదరుడు అహాన్ శెట్టి
- ఇంత వరకు నిశ్చితార్థం జరగలేదని వివరణ
కేఎల్ రాహుల్, అతియా పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని అహాన్ శెట్టి తెలిపాడు. ఇప్పటి వరకు ఎలాంటి నిశ్చితార్థం కూడా జరగలేదని చెప్పాడు. పెళ్లికి సంబంధించిన చర్చే జరగనప్పుడు వివాహ తేదీని ఎలా చెపుతామని ప్రశ్నించాడు. ప్రతి ఈద్ ను తాము తమ తాత ఇంట్లో జరుపుకుంటామని, ఈ సారి కూడా తాత ఇంటికి వెళ్లామని, తమ మధ్య పెళ్లికి సంబంధించిన విషయాలు చర్చకు రాలేదని తెలిపాడు. రానున్న కొన్ని నెలల వరకు కూడా పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక లేదని చెప్పాడు.