14 ఏళ్ల నాటి కేసులో రాజ్ థాకరేకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ
- 2008లో థాకరేపై విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు
- శిరాలా కోర్టు విచారణకు గైర్హాజరవుతున్న రాజ్
- అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచమన్న కోర్టు
2008లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ రాజ్ థాకరే సహా శిరీస్ పార్కర్‌లపై కేసు నమోదయింది. ఈ కేసును శిరాలా కోర్టు విచారిస్తోంది. కేసు విచారణలో భాగంగా వాయిదాలకు హాజరు కాని రాజ్ థాకరే, శిరీస్‌లను తదుపరి విచారణకు తమ ముందు హాజరుపరచాలని కోర్టు ముంబై పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.