ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ
- మే 6న తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ
- 7న హైదరాబాద్‌కు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
- ఓయూలో రాహుల్ సభకు గవర్నింగ్ కౌన్సిల్ నిరాకరణ
మే 6న తెలంగాణ పర్యటనకు రానున్న రాహుల్ గాంధీ అదే రోజున వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు. ఆ మరునాడు హైదరాబాద్‌లో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఓయూలోనూ రాహుల్ గాంధీ కోసం ఓ సభ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ అధికారులను కోరింది. ఈ ప్రతిపాదనపై సుధీర్ఘంగా ఆలోచన చేసిన ఓయూ గవర్నింగ్ కౌన్సిల్ రాహుల్ గాంధీ సభకు అనుమతిని నిరాకరిస్తూ ప్రకటన జారీ చేసింది.