వచ్చే శుక్రవారం బరిలో మూడు సినిమాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే శుక్రవారం బరిలో మూడు సినిమాలు!

Bhala Thandanana release date confirmed
  • ఈ శుక్రవారం విడుదలైన 'ఆచార్య'
  • వచ్చేవారాన్ని ఫిక్స్ చేసుకున్న విష్వక్సేన్ 
  • అదే రోజున రానున్న 'జయమ్మ పంచాయితీ'
  • ఈ రెండిటికీ పోటీగా దిగిన 'భళా తందనాన'
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు 'ఆచార్య' వచ్చింది. చిరంజీవి .. చరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ తో ప్రేక్షకుల ముందుకు వెళ్లింది. ఆ తరువాత వారంలో .. అంటే మే 6వ తేదీన 'అశోకవనంలో అర్జున కల్యాణం'  .. 'జయమ్మ పంచాయితీ' ఉన్నాయి. అదే రోజున తాను కూడా వస్తున్నట్టుగా 'భళా తందనాన' కూడా రంగంలోకి దిగేసింది. 

విష్వక్సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రుక్సార్ థిల్లాన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ బ్యూటీ మంచి మార్కులు కొట్టేసింది. ఇక గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో .. ' జయమ్మ పంచాయితీ' పేరుతో సుమ రంగంలోకి దిగుతోంది. 

ఇక శ్రీవిష్ణు - కేథరిన్ జంటగా చైతన్య దంతులూరి రూపొందించిన ఈ సినిమా, వారాహి బ్యానర్ పై నిర్మితమైంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వదిలిన లిరికల్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గరుడ రామ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
Sri Vishnu
Catherine
Chaithanya
Bhala Thandanana Movie

More Telugu News