Jeevitha: జోష్టర్ ఫిలిం సర్వీసెస్ ఆరోపణలపై జీవిత స్పందన

Jeevitha responds on allegations
షార్ట్స్‌లో చూడండి
జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ నుంచి రూ.26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. అంతేకాదు, జీవిత, రాజశేఖర్ లపై నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిందని కూడా జోష్టర్ ఫిలం సర్వీసెస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు వెల్లడించారు. 

ఈ ఆరోపణలపై జీవిత స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. రేపు (శనివారం) 'శేఖర్' సినిమా ప్రెస్ మీట్ ఉందని, ఆ ప్రెస్ మీట్ లో అన్ని వివరాలు చెబుతానని తెలిపారు. పూర్తి ఆధారాలు మీడియా ముందుకు తీసుకువస్తానని, అప్పటివరకు దీనిపై ఎవరూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. 

జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం శేఖర్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, గత కొంతకాలంగా రాజశేఖర్ కెరీర్ స్లో అయింది. పెద్దగా హిట్లు కూడా లేని స్థితలో గరుడవేగ చిత్రం రాజశేఖర్ ను మళ్లీ హిట్ బాట పట్టించింది.
Go Back to Shorts
Jeevitha
Allegations
Rajasekhar
Tollywood

More Telugu News