జీవితా రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌పై జోష్ట‌ర్ ఫిలిం స‌ర్వీసెస్ ఆరోపణలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీవితా రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌పై జోష్ట‌ర్ ఫిలిం స‌ర్వీసెస్ ఆరోపణలు

  • రూ.26 కోట్ల అప్పును ఎగ‌వేశార‌న్న కంపెనీ డైరెక్ట‌ర్‌
  • గ‌రుడ వేగ సినిమా కోసం అప్పు తీసుకున్నారని వ్యాఖ్య 
  • న‌గ‌రి కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్లు జారీ చేసింద‌ని వెల్లడి  
ప్ర‌ముఖ సినీ న‌టుడు రాజ‌శేఖ‌ర్‌, ఆయ‌న భార్య జీవిత‌పై జోష్ట‌ర్ ఫిలిం స‌ర్వీసెస్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. త్వ‌ర‌లోనే రాజ‌శేఖ‌ర్ జైలుకు వెళ‌తారంటూ ఆ సంస్థ డైరెక్ట‌ర్ కోటేశ్వ‌ర్ రాజు శుక్ర‌వారం వ్యాఖ్యానించారు. త‌మ‌ను జీవితా రాజేశ‌ఖ‌ర్‌లు భారీఎత్తున మోస‌గించార‌ని ఆరోపించిన రాజు... ఈ  కేసులో న‌గ‌రి కోర్టు జీవితా రాజశేఖర్‌పై నాన్ బెయిల‌బుల్ వారెంట్లు జారీ చేసింద‌ని కూడా చెప్పారు. 

కోటేశ్వ‌ర రాజు ఆరోప‌ణ‌ల మేర‌కు... జోష్ట‌ర్ ఫిలిం స‌ర్వీసెస్ నుంచి జీవితా రాజ‌శేఖ‌ర్‌లు రూ.26 కోట్ల మేర అప్పు తీసుకుని ఎగ్గొట్టారు.. గ‌రుడ వేగ సినిమా కోసం జీవితా రాజశేఖర్‌లు అప్పు అడిగితే జోష్ట‌ర్ ఫిలిం స‌ర్వీసెస్ త‌మ ఆస్తులు తాక‌ట్టు పెట్టుకుని డ‌బ్బు సర్దుబాటు చేసింది.

ఆ ఆస్తుల‌ను బినామీల పేర్ల మీద‌కు మార్చుకుని జీవితా రాజశేఖ‌ర్‌లు మోసం చేశారు. జీవితా రాజ‌శేఖర్‌ల‌పై చెక్ బౌన్స్ కేసు న‌డుస్తోంది. ఈ కేసులో న‌గ‌రి కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.  
Jeevitha rajasekhar
Tollywood
joster film services

More Telugu News