మే 4న తెలంగాణకు రాహుల్.. రెండు రోజుల పర్యటన ఖరారు
- మే 4న వరంగల్ లో భారీ బహిరంగ సభకు రాహుల్
- మే 5న బోయిన్పల్లిలో పార్టీ శ్రేణులతో భేటీ
- రేపు హైదరాబాద్కు మాణిక్కం ఠాగూర్
- రాహుల్ పర్యటనపై పీసీసీ నేతలతో భేటీ
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ శుక్రవారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పీసీసీ కార్యవర్గంతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ పర్యటన, వరంగల్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించనున్నారు.