తన భర్తను ఉద్దేశించి భావోద్వేగమైన పోస్ట్ చేసిన కాజల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన భర్తను ఉద్దేశించి భావోద్వేగమైన పోస్ట్ చేసిన కాజల్

Actress Kajal Aggarwal pens emotional post on her husband
  • గొప్ప భర్తగా ఉన్నందుకు ధన్యవాదాలన్న కాజల్ 
  • ప్రతి క్షణం నన్ను ఎంతో సంరక్షించావని కామెంట్ 
  • పుట్టబోయే బిడ్డను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో తనకు తెలుసన్న ముద్దుగుమ్మ 

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మరికొన్ని రోజుల్లో తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భర్త గౌతమ్ కిచ్లూ గురించి ఆమె సోషల్ మీడియాలో ప్రేమతో కూడిన పోస్ట్ చేసింది.  

'ప్రియమైన శ్రీవారూ... గొప్ప భర్తగా ఉన్నందుకు, ప్రతి బిడ్డ కోరుకునేంత మంచి తండ్రిగా ఉండబోతున్నందుకు ధన్యవాదాలు. అలసటగా ఉన్నప్పుడు, రాత్రుళ్లు సరిగా నిద్రలేనప్పుడు నువ్వు కూడా నాతో పాటు నిద్రలేచి, నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ సౌకర్యవంతంగా ఉండేలా చేశావు. ప్రతి క్షణం నన్ను ఎంతో సంరక్షించావు. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేశావు.

త్వరలోనే మన ముద్దుల బిడ్డ ఈ లోకంలోకి వస్తుంది. ఆలోగా నీవు ఎంత గొప్ప వ్యక్తివో నీకు తెలియజేయాలనుకుంటున్నా. ఈ ఎనిమిది నెలల్లో నీలో ఒక గొప్ప తండ్రిని చూశా. పుట్టబోయే బిడ్డను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో, బిడ్డ సంరక్షణ కోసం నీవు ఎంతగా శ్రమిస్తున్నావో నాకు తెలుసు. నీ అమితమైన ప్రేమ మన బిడ్డ అదృష్టంగా భావిస్తున్నా. బిడ్డకు నీవు ఎప్పుడూ ఒక ప్రేరణగా ఉండాలని కోరుకుంటున్నా. 

త్వరలోనే మన జీవితాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి మాదిరి మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోలేం. సినిమాలు, షికార్లకు వెళ్లలేం. టీవీ చూస్తూ ఆలస్యంగా పడుకోలేం. పార్టీలకు దూరమవుతాం. వీటన్నింటికి దూరమైనా బిడ్డతో విలువైన సమయాన్ని గడుపుతాం. మన జీవితంలో ప్రతిక్షణం మరింత ఆనందంగా మారుతుంది. పరిస్థితులు మారొచ్చు కానీ, నాపై నీకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఐ లవ్యూ' అని తన భర్తను ఉద్దేశించి భావోద్వేగంతో కూడిన పోస్ట్ షేర్ చేసింది.
Kajal Aggarwal
Husband
Emotional Post

More Telugu News