ఆసక్తిక‌ర స‌న్నివేశం!.. బాలినేని వెంట జ‌గ‌న్ వ‌ద్ద‌కు క‌ర‌ణం బ‌ల‌రాం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసక్తిక‌ర స‌న్నివేశం!.. బాలినేని వెంట జ‌గ‌న్ వ‌ద్ద‌కు క‌ర‌ణం బ‌ల‌రాం!

karanam balaram spotted at balineni house
  • బాలినేని ఇంటి వ‌ద్ద ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా క‌ర‌ణం
  • జ‌గ‌న్ ఇంటికి బాలినేనితో క‌లిసి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే
  • జ‌గ‌న్‌తో బాలినేని చ‌ర్చ‌ల్లో కీల‌క భూమిక పోషించ‌నున్నార‌ని విశ్లేష‌ణ‌లు
ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవస్థీక‌ర‌ణ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్న భావ‌న‌లో అల‌క బూనిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్య‌వహారం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. జ‌గ‌న్‌కు ద‌గ్గ‌రి బంధువు అయిన బాలినేనికి స‌ర్దిచెప్పేందుకు జ‌గ‌న్ త‌ర‌ఫున నిన్నటి నుంచి సాగుతున్న య‌త్నాలు సోమ‌వారం సాయంత్రానికి గానీ ఓ కొలిక్కి రాలేదు. ఆదివారం రెండు సార్లు వైసీపీ కీల‌క నేత‌, ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న ఇంటికి వ‌చ్చినా బాలినేని శాంతించ‌ని విష‌యం తెలిసిందే.

అయితే బాలినేనిని త‌న వ‌ద్ద‌కు తీసుకురావాలంటూ స్వ‌యంగా జ‌గ‌న్ ఆదేశించ‌డంతో సోమ‌వారం మూడో మారు బాలినేని ఇంటికి స‌జ్జ‌ల వెళ్లారు. సుదీర్ఘంగా చ‌ర్చించిన మీద‌ట జ‌గ‌న్‌ను క‌లిసేందుకు బాలినేని స‌మ్మ‌తించారు. ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం క‌నిపించింది. బాలినేని ఇంటి వ‌ద్ద ఆదివారం నుంచి టీడీపీకి దూరంగా జ‌రిగిన ఆ పార్టీ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి క‌నిపించి అంద‌రి దృష్టిని త‌న‌వైపున‌కు తిప్పుకున్నారు. తాజాగా జ‌గ‌న్ ఇంటికి బాలినేని బ‌య‌లుదేర‌గా... ఆయ‌న వెంట క‌ర‌ణం కూడా వెళ్లారు. బాలినేనితో చ‌ర్చ‌ల్లో క‌ర‌ణం కీల‌క భూమిక పోషించే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న దిశ‌గా ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
YSRCP
Karanam Balaram
Balineni Srinivasa Reddy
Sajjala Ramakrishna Reddy

More Telugu News