50 ఏళ్ల వయసులోనూ ఫిట్ నెస్ చూపిస్తున్న మందిరా బేడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

50 ఏళ్ల వయసులోనూ ఫిట్ నెస్ చూపిస్తున్న మందిరా బేడీ

Mandira Bedi sets fitness goals with intense workout video
  • డంబుల్స్ తో కసరత్తులు
  • బాల్ తో ఎక్సర్ సైజ్
  • కాఫీ, ఎక్సర్ సైజ్ ఉంటే చాలంటూ వ్యాఖ్య
ప్రముఖ హిందీ నటి, ఫ్యాషన్ డిజైనర్, మాజీ టీవీ కామెంటేటర్ మందిరా బేడీ గుర్తుండే ఉంటుంది. ఫ్యాషన్, ఫిట్ నెస్ కు ఆమె ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంటారు. తన ఫిట్ నెస్ సెషన్లకు సంబంధించి వీడియోలను అభిమానులతో పంచుకోవడం కూడా ఆమెకు అలవాటు. 

తాజాగా ఆమె ఇటువంటిదే ఒక వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 49 ఏళ్ల వయసులోనూ ఆమెలోని ఫిట్ నెస్ ఫ్యాషన్ చూస్తే ముచ్చటేస్తుంది. డంబుల్స్ చేయడం, బాల్ తో ఎక్సర్ సైజ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. ‘‘ఎక్సర్ సైజ్, కాఫీతో.. నన్ను లైట్ స్విచ్ లా ఆన్ చేయవచ్చు’’ అని ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొనడం గమనార్హం. (వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

1994లో టెలివిజన్ సీరియల్ 'శాంతి'లో టైటిల్ పాత్రతో మందిరా బేడీ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నాడు అది దూరదర్శన్ లో ప్రసారమైంది. సాహో చిత్రంలో విలన్ పాత్రలోనూ కనిపించారు. ఎన్నో టీవీ సీరియళ్లలో ఆమె నటించి మెప్పించారు. 2003, 2007 ప్రపంచకప్ లు, 2004, 2006 చాంపియన్స్ ట్రోపీల సమయంలో కామెంటేటర్ గా పనిచేశారు.
Mandira Bedi
actor
commentator

More Telugu News