సన్నిలియోన్ కి 'గాలి నాగేశ్వరరావు' గట్టిగానే ముట్టజెబుతున్నాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సన్నిలియోన్ కి 'గాలి నాగేశ్వరరావు' గట్టిగానే ముట్టజెబుతున్నాడట!

Gaali Nageshwara Rao movie update
  • సన్నీ లియోన్ కి విపరీతమైన క్రేజ్ 
  • తెలుగులో గతంలో ఒక సినిమా చేసిన సన్నీ 
  • మంచు విష్ణు సరసన ఛాన్స్ 
  • ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ పూర్తి
సన్నీలియోన్ .. కొంతకాలం క్రితం వరకూ కుర్రాళ్లకు కునుకు పట్టకుండా చేసిన పేరు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇచ్చిన బ్యూటీ. ప్రపంచవ్యాప్తంగా ఆమెకి అభిమానులు .. ఆరాధకులు ఉన్నారు. అందువలన ఆమె సినిమాలకి మంచి డిమాండ్ ఉంది.

తెలుగులో కూడా సన్నీలియోన్ తో సినిమాలు చేయాలని కొంతమంది ప్రయత్నించారు. కానీ ఆమె అడిగే పారితోషికానికి భయపడి వెనకడుగు వేశారు. 'కరెంట్ తీగ' అనే మంచు మనోజ్ సినిమాలో మాత్రమే ఆమె ఒకసారి మెరిసింది. మళ్లీ ఇప్పుడు ఆమె మంచు విష్ణుతో కలిసి సందడి చేయనుంది. 

మంచు విష్ణు తన సొంత బ్యానర్లో 'గాలి నాగేశ్వరరావు' సినిమా చేస్తున్నాడు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆల్రెడీ తిరుపతిలో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో రేణుక అనే ఎన్నారై పాత్రలో సన్నీలియోన్ కనిపించనుంది. ఈ సినిమా కోసం ఆమె 20 రోజులు మాత్రమే షూటింగులో పాల్గొంటుందట. అందుకోసం ఆమె అందుకుంటున్న పారితోషికం రెండున్నర కోట్లు అనేది సమాచారం.
Manchu Vishnu
Sunny Leone
Gaali Nageshwara Rao Movie

More Telugu News