'రంగస్థలం' తరహాలోనే నితిన్ తాజా చిత్రం?
- నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజక వర్గం'
- గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా కృతి శెట్టి
- ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు
నితిన్ సినిమా గ్రామీణ నేపథ్యంలో .. అక్కడి రాజకీయాలతో ముడిపడి నడుస్తుంది. ఎప్పుడూ ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా గెలిచి అక్రమాలకు పాల్పడుతున్న పెద్ద మనిషి ఆటకట్టించడం కోసం, ఆ పదవికి పోటీ చేస్తూ హీరో రంగంలోకి దిగుతాడట. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రివేంజ్ డ్రామా మొదలవుతుందని అంటున్నారు.
నితిన్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 'భీష్మ' తరువాత నితిన్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.