Kalaavathi: సర్కారు వారి పాట నుంచి 'కళావతి' సాంగ్ విడుదల

Kalaavathi song released from Sarkaru Vaari Paata
షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. తాజాగా ఈ చిత్రం నుంచి 'కళావతి' అనే పాట విడుదలైంది. వాస్తవానికి ఈ పాట విడదులకు ముందు లీక్ కావడంతో చిత్రబృందం తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో తాజా పాటను ఒరిజినల్ ఆడియోతో చిత్రబృందం రిలీజ్ చేసింది. 'మాంగల్యం తంతునా నేనా' అంటూ సాగే ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ హృద్యంగా ఆలపించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. విశేషం ఏమిటంటే ఈ పాటకు తమన్ కళావతి రాగంలో బాణీలు కట్టారు.

కాగా, ఈ పాటను సోషల్ మీడియాలో పంచుకున్న మహేశ్ బాబు... తన ఫేవరెట్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. సర్కారు వారి పాట చిత్రం మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Go Back to Shorts
Kalaavathi
Sarkaru Vaari Paata
Song
Mahesh Babu
Thaman
Anantha Sriram
Parasuram
Tollywood

More Telugu News