గోపీచంద్ కి విలన్ గా జగపతిబాబు!
- శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్
- ఇద్దరి కాంబినేషన్లో మూడో మూవీ
- గతంలో వచ్చిన లక్ష్యం .. లౌక్యం హిట్
- హ్యాట్రిక్ హిట్ పైనే దృష్టి
కానీ ఈ సినిమాలో జగపతిబాబు చేయనున్నాడనేది ఈ రోజున ఖాయమైంది. జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం పలికింది. దాంతో ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా కనిపించనున్నాడనేది స్పష్టమైపోయింది.
ఇక ఆల్రెడీ ఈ ఏడాదిలో 'గని' .. 'రాధే శ్యామ్' .. 'సలార్' సినిమాలతో జగపతిబాబు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇంతకుముందు శ్రీవాస్ తెరకెక్కించిన 'లక్ష్యం' .. 'సాక్ష్యం' సినిమాల్లోను జగపతిబాబు నటించారు. గోపీచంద్ కి రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాస్, ఈ సినిమాతో ఆయనతో కలిసి హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.