బాలీవుడ్ నటి శ్వేతా తివారీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎఫ్ఐఆర్ నమోదు
- నా బ్రా సైజును దేవుడే తీసుకుంటున్నాడు
- ఇది చాలా మందికి నచ్చదంటున్న శ్వేత
- విచారణకు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి ఆదేశాలు
ఈ వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి వెళ్లాయి. ‘‘నేను శ్వేతా తివారీ ప్రకటన చూశాను. దీన్ని ఖండిస్తున్నా. దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని భోపాల్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించాను. ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి ప్రకటించారు. ఆయన ఆదేశాలతో శ్వేతా తివారీకి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్ 295(ఏ) కింద శ్యామలాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.