మమ్మల్ని ఆ దేవుడే కలిపాడు: బాలకృష్ణ

Akhanda movie update
  • డిసెంబర్ 2వ తేదీన వచ్చిన 'అఖండ'
  • నిన్నటితో 50 రోజులు పూర్తి 
  • ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్
  • హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో సెలబ్రేషన్స్  
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'అఖండ' .. డిసెంబర్ 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. నిన్నటితో ఈ సినిమా 103 థియేర్లలో  50 రోజులను పూర్తిచేసుకుంది .. 200 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్ - సుదర్శన్ థియేటర్లో 50 డేస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు.

ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ .. 'అఖండ' పాన్ ఇండియా సినిమా కాదు .. పాన్ వరల్డ్ సినిమా అని నిరూపించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. భక్తికి సంధించిన ఎన్నో పాత్రలను నాన్నగారు పోషించారు. ఆయనను తలచుకుంటూ నటించడం వల్లనే ఈ సినిమాలోని నా పాత్రను అంత బాగా చేయగలిగాను. తమన్ ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

బోయపాటి, నేను కలిసి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాము. మాది జన్మజన్మల బంధం .. ఆ దేవుడే మా ఇద్దరినీ కలిపాడు. ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు .. కర్ణాటక .. మహారాష్ట్రలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఇప్పుడు 'అఖండ' అర్థశతదినోత్సవ వేడుక జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.
Balakrishna
Pragyajaiswal
Boyapati Sreenu

More Telugu News