'శేఖర్' చిత్రంలోని 'లవ్ గంటే..' పాటకు విశేష స్పందన
- రాజశేఖర్ హీరోగా 'శేఖర్'
- జీవిత దర్శకత్వంలో చిత్రం
- త్వరలోనే రిలీజ్
- మిలియన్ వ్యూస్ కు చేరువలో 'లవ్ గంటే..' సాంగ్
ఇందులో ఆత్మీయ రంజన్, ముస్కాన్, అభినవ్ గోమటం, కన్నడ కిశోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రావణ్ రాఘవేంద్ర నటించారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కిన 'శేఖర్' చిత్రానికి బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ లతో పాటు రాజశేఖర్ కుమార్తెలు శివాత్మిక, శివానీలు కూడా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.