విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసహనం!

Liger movie update
  • పూరి తాజా చిత్రంగా 'లైగర్'
  • బాక్సర్ పాత్రలో విజయ్ దేవరకొండ 
  • కథానాయికగా అనన్య పాండే 
  • ఆగస్టు 25వ తేదీన విడుదల  
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జొహార్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ రోజు ఉదయం ప్రకటించారు.

ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించిన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్రమైన అసహనానికి లోనవుతున్నారు. ఇంత ఆలస్యం దేనికి? అనే విషయం చర్చనీయాంశమైపోయింది.

కరోనా ప్రభావం వలన ఈ సినిమా షూటింగు విషయంలోను జాప్యం జరిగింది. అయినా పూరి స్పీడ్ తెలిసిన వాళ్లంతా వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా వస్తుందని అనుకున్నారు.  కానీ ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలోకి వెళ్లిపోవడం పట్ల వాళ్లంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జొహార్ ప్రమేయమే ఇందుకు కారణమనే టాక్ బలంగానే వినిపిస్తోంది.
Go Back to Shorts
Vijay Devarakonda
Ananya Pnaday
Puri Jagannadh
Liger Movie

More Telugu News