Sathyadev: 'స్కైలాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టుగా నాని!

  • వినోదమే ప్రధానంగా 'స్కైలాబ్'
  • గ్రామీణ నేపథ్యంలోని కథ 
  • రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్  
  • డిసెంబర్ 4వ తేదీన విడుదల
Skylab Pre Release Event On 28th November

సత్యదేవ్ .. నిత్యామీనన్ జంటగా 'స్కైలాబ్' సినిమా రూపొందింది. పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన ఈ సినిమాకి, విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను వచ్చేనెల 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ  సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, U సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాని రానున్నాడు. 'అలా మొదలైంది'  సినిమా నుంచి కూడా నిత్యా మీనన్ - నాని మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందువల్లనే నాని ఈ వేడుకకు వస్తున్నాడని అంటున్నారు.

ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, రాహుల్ రామకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ, ఆస్తులు .. అంతస్తులు కాదు అనుబంధాలు శాశ్వతం అనే సందేశాన్ని ఇచ్చేదిగా సాగుతుంది.
కొంత గ్యాప్ తరువాత నిత్యా మీనన్ చేసిన ఈ సినిమా ఆమెకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి..

More Telugu News