జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న
- చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు
- జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై మండిపడుతున్న టీడీపీ శ్రేణులు
- కొడాలి నానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది తారకేనన్న బుద్ధా వెంకన్న
తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ... భువనేశ్వరిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వింటుంటే తమ రక్తం మరిగిపోతోందని అన్నారు. కొడాలి నాని మాటలపై సింహాద్రిలానో, ఆదిలానో జూనియర్ ఎన్టీఆర్ విరుచుకుపడతాడనుకుంటే... చాగంటి ప్రవచనాలు చెపుతున్నట్టు స్పందించాడని అన్నారు. వారిని హెచ్చరించకుండా ఎందుకు ఎన్టీఆర్ ఎందుకు వదిలేశాడని ప్రశ్నించారు. తారక్ స్పందనను చూసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త బాధపడుతున్నాడని అన్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయి ఉన్నా బాగుందేది అని చెప్పారు. కొడాలి నానికి తొలుత ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆరేనని అన్నారు.