మహారాష్ట్ర మాజీ హోంమంత్రికి జ్యుడీషియల్ రిమాండ్
- మనీలాండరింగ్ కేసులో 14 రోజుల రిమాండ్
- జైల్లోని ఆహారాన్నే తీసుకోవాలని కోర్టు ఆదేశాలు
- జైల్లో బెడ్ ఏర్పాటు చేసేందుకు కోర్టు అనుమతి
ఈ నెల 2న మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ ముఖ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కార్యాలయంలో విచారణ జరిపిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆయనపై సీబీఐ కూడా అవినీతి కేసు నమోదు చేసింది. అనిల్ దేశ్ ముఖ్ పై ముంబై మాజీ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదైంది.