అమెజాన్ ప్రైమ్ ఒడిలోకి 'మరక్కార్'

Marakkar movie will release in OTT
  • భారీ చారిత్రక చిత్రంగా 'మరక్కార్'
  • నిజమైన వీరుడి చుట్టూ అల్లుకున్న కథ 
  • కరోనా కారణంగా రిలీజ్ లో జాప్యం
  • కీలకమైన పాత్రలో అర్జున్         
మోహన్ లాల్ కెరియర్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు కనిపిస్తాయి. అలాంటి చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో, ఆయన తాజా చిత్రమైన 'మరక్కార్' కూడా చేరనుందని అంటున్నారు. ఇది ఒక యోధుడి కథ .. అరేబియన్ సీ ప్రాంతానికి చెందిన వీరుడి కథ. ఆ పాత్రను ప్రధానంగా చేసుకుని ప్రియదర్శన్ రూపొందించిన ఈ సినిమాను ఆంటోని పెరుంబవూర్ నిర్మించాడు.

భారీ చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లకు వస్తుందని అంతా అనుకుంటున్న సమయంలో, తాము ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేసినట్టుగా మేకర్స్ స్పష్టం చేశారు. దాంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఈ సినిమాకి భారీ ఆఫర్ రావడం వల్లనే డైరెక్ట్ రిలీజ్ చేసుకునేలా మేకర్స్ అమ్మేశారని తెలుస్తోంది. నిజానికి ఇది థియేటర్లలో చూడవలసిన 'బాహుబలి' తరహా భారీ సినిమా. అలాంటి ఈ సినిమా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా పలకరించనుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అర్జున్ .. సునీల్ శెట్టి .. మంజూ వారియర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Go Back to Shorts
Mohanlal
Keerthi Suresh
Arjun
Manju Warrier

More Telugu News