Gorantla Butchaiah Chowdary: బహిష్కరణ చేసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి ఏంటీ?: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

gorantla fires on ycp
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ అత్య‌ధిక స్థానాల్లో విజయం సాధించిన విష‌యం తెలిసిందే. త‌మ పార్టీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించిందని, టీడీపీ ఘోరంగా ఓడిపోయింద‌ని వైసీపీ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్య‌ల ప‌ట్ల టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స్పందిస్తూ కౌంట‌ర్ ఇచ్చారు.  

"ఊహించిన గెలుపున‌కు బాజాలు... అవి 'ఎలక్షన్స్ కాదు సెలెక్షన్స్'.. ప్రజా స్వేచ్ఛని హరించి గెలిచారు. ఎన్నికల్లో అందుకే టీడీపీ నామమాత్రంగా పోటీ.. బహిష్కరణ చేసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి ఏంటీ? వైసీపీ ఏకపక్ష విజయం ఏంటి?" అని  గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్రశ్నించారు.
Go Back to Shorts
Gorantla Butchaiah Chowdary
Telugudesam
YSRCP

More Telugu News