ఆఫ్ఘన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరగనివ్వం: తాలిబన్లు
- మీడియాకు తెలిపిన విదేశాంగ మంత్రి మొలావీ
- ఉగ్రవాదులకు అడ్డాగా ఆఫ్ఘన్‌ను మారనివ్వం
- అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదు
అలాగే, ఆఫ్ఘన్‌లో మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తారా? అన్న విషయాలనూ ఆయన తెలపలేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న విషయంపై ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదని దాటవేశారు. కాగా, అల్‌ఖైదా వంటి ఉగ్ర సంస్థలతో సత్సంబంధాలు పెట్టుకోకూడదన్న విషయంపై అమెరికాతో చర్చల సందర్భంగా గత ఏడాది తాలిబన్లు ఒప్పందం చేసుకున్నారు.