Shiva Nirvana: విజయ్ దేవరకొండతో సినిమా ఆగిపోలేదన్న శివ నిర్వాణ!

Vijay Devarakonda in Shiva Nirvana movie
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్లో వరుస విజయాలను అందుకుంటున్న యువ దర్శకులలో, అనిల్ రావిపూడి తరువాత శివ నిర్వాణ పేరు వినిపిస్తోంది. 'నిన్ను కోరి' .. 'మజిలీ' వంటి విభిన్నమైన కథలను తెరకెక్కించి తన సత్తాను చాటుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'టక్ జగదీష్' ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఆయనకి, ఒక ప్రశ్న ఎదురైంది. గతంలో విజయ్ దేవరకొండతో చేయనున్నట్టు ఆయన చెప్పిన వార్తలను గురించిన ప్రశ్న అది. ఆ ప్రాజెక్టు ఆగిపోలేదనీ .. తమ కాంబినేషన్లో సినిమా ఉంటుందని శివ నిర్వాణ సమాధానం ఇచ్చాడు.

శివ నిర్వాణ చెప్పిన కథ నచ్చక పోవడం వలన విజయ్ దేవరకొండ నో చెప్పేసినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అలాంటిదేం లేదని శివ నిర్వాణ క్లారిటీ ఇవ్వడంతో, ఆ ప్రచారానికి తెరపడింది. ఇక ఈ ఇద్దరూ ఎప్పుడు సెట్స్ పైకి వెళతారా అనేదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించే అంశం.
Go Back to Shorts
Shiva Nirvana
Vijay Devarakonda
Tollywood

More Telugu News