తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు!
- రాష్ట్రంలో సాధారణంగా రుతుపవన కదలికలు
- ఒడిశా తీరం వద్ద అల్పపీడనం
- మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు
బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద నిన్న అల్పపీడనం ఏర్పడగా, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా, గత మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.