ఇరాన్‌తో యుద్ధం.. చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన
- ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగుస్తుందని ట్రంప్ ప్రకటన
- యుద్ధం తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని అంచనా
- ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనివ్వబోమని స్పష్టీకరణ
- యుద్ధంతో చమురు ధరలు పెరిగినా అంచనాల మేర పెరగలేదని వ్యాఖ్య
- ఇరాన్‌తో ఒప్పందంపై విట్‌కాఫ్ చర్చలు జరుపుతున్నారని వెల్లడి
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యుద్ధం ముగిసిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పడిపోతాయని అంచనా వేశారు. ఇరాన్ అణ్వాయుధం పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రచార సభలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ అణు ముప్పును ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యలను ఆయన సమర్థించుకున్నారు.
త్వరలోనే బయటకు..
అమెరికా సైనిక చర్యలు త్వరలో ముగిసే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. ‘‘మేం త్వరలోనే అక్కడి నుంచి బయటకు వస్తాం. ఆ తర్వాత చమురు ధరలు కిందకు పడిపోతాయి’’ అని అన్నారు. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయని అంగీకరించినా.. ఊహించినంతగా పెరగలేదని చెప్పారు.
గత ప్రభుత్వాలు ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యాయని ట్రంప్ విమర్శించారు. చాలా ఏళ్ల క్రితమే ఈ సమస్యను పరిష్కరించాల్సిందని పేర్కొన్నారు.
అణ్వాయుధానికి నో..
ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందనివ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తన ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ ఈ వ్యవహారంలో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అయితే యుద్ధం ముగియాలనే తొందరలో ఏదో ఒక ఒప్పందాన్ని అంగీకరించేందుకు తాను సిద్ధంగా లేనని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్ సంక్షోభం వల్ల ఇంధన ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికంగా కనిపిస్తోందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. యుద్ధం ముగిశాక ఇంధన సరఫరాలు మెరుగుపడతాయని, ద్రవ్యోల్బణం తగ్గడంతో పాటు రుణ వడ్డీ రేట్లు కూడా దిగివచ్చే అవకాశం ఉందని చెప్పారు.