తెలంగాణ రోజువారీ కరోనా కేసుల తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 81,193 కరోనా పరీక్షలు
- 357 మందికి పాజిటివ్ నిర్ధారణ
- జీహెచ్ఎంసీ పరిధిలో 96 కొత్త కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 6,246
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 405 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 6,56,455 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,46,344 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,246 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,865కి పెరిగింది.
