సినీ దర్శకుడు మురుగదాస్ పై కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు
- 2018లో విజయ్ హీరోగా 'సర్కార్' సినిమా తీసిన మురుగదాస్
- ప్రభుత్వ ఉచిత పథకాలను సినిమాలో ఎండగట్టిన వైనం
- మురుగదాస్ పై హైకోర్టులో కేసు వేసిన అన్నాడీఎంకే కార్యకర్త
మరోవైపు ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు మద్రాస్ హైకోర్టు నుంచి మురుగదాస్ ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. దీనికి తోడు కేసును కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ... సెన్సార్ ను పూర్తి చేసుకున్న తర్వాతే ఈ సినిమా విడుదలయిందని... సెన్సార్ అయిన తర్వాత ఒక వ్యక్తి కానీ, ప్రభుత్వం కానీ కేసు పెట్టలేరని... ఈ పిటిషన్ రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకమని తెలిపింది. పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు చెప్పింది.