బీఎస్పీలో చేరనున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీఎస్పీలో చేరనున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్

Praveen Kumar to join BSP
  • వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ కుమార్
  • ప్రస్తుతం రాష్ట్ర పర్యటన చేస్తున్న మాజీ ఐపీఎస్  
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టే అవకాశం
ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వయంగా వెల్లడించారు. ప్రవీణ్ కుమార్ కు మాయావతి ఆఫర్ ఇచ్చినట్టు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ప్రవీణ్ కుమార్ కు ఇచ్చేందుకు మాయావతి సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలు నిజం కానున్నాయి. త్వరలోనే ఆయన బీఎస్పీలో చేరనున్నారు.

వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రవీణ్ కుమార్ రాష్ట్ర పర్యటన చేపట్టారు. స్వేరో సంస్థను ఆయన ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్వేరోలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే స్వేరో సంస్థలో దాదాపు 50 వేల మంది సభ్యులు ఉన్నారు.

 వాస్తవానికి ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసినప్పుడు... ఆయన సొంత రాజకీయ పార్టీని పెట్టబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే సొంత పార్టీని అభివృద్ధి చేయడం కష్టంతో కూడిన పని కావడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీలో చేరాలని ఆయన నిర్ణయించుకోవడం, దానికి మాయావతి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.
Praveen Kumar
IPS
BSP

More Telugu News