రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ పొడిగింపు
- పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా
- ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
- కస్టడీని 27 వరకు పొడిగించిన కోర్టు
ఈ నెల 19న రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ యాప్ ద్వారా పోర్న్ కంటెంట్ ను చూపిస్తున్నారనే ఆరోపణలతో వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాజ్ కుంద్రా నుంచి 4 టీబీ అడల్ట్ కంటెంట్ ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. ఆశ్లీల చిత్రాల ద్వారా వచ్చిన సంపాదనను రాజ్ కుంద్రా ఆన్ లైన్ బెట్టింగులకు ఉపయోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.