అది పోర్న్ కాదు.. వెబ్ సిరీస్ మాత్రమే: రాజ్ కుంద్రా తరపు లాయర్
- పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్
- పోలీస్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా
- ఆ వీడియో షూట్ వెబ్ సిరీస్ కి సంబంధించినదన్న న్యాయవాది
రాజ్ కుంద్రా అరెస్ట్ కు కారణమైన వీడియో షూట్ ఒక వెబ్ సిరీస్ కి సంబంధించినదని సదరు న్యాయవాది అన్నారు. ఆ షూట్ ఓ వెబ్ సిరీస్ మాత్రమే తప్ప పోర్న్ ఫిలిం కాదని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్టు ఉంటేనే పోర్న్ కిందకు వస్తుందని... అశ్లీల సన్నివేశాలు ఉన్నంత మాత్రాన పోర్న్ కిందకు రాదని అన్నారు.