మంగ్లీ పాడిన బోనాల పాటపై వివాదం!
- తెలంగాణలో బోనాలు
- మంగ్లీ పాటపై విమర్శలు
- కొన్ని పదాలపై అభ్యంతరాలు
- మంగ్లీ ఎలా పాడిందంటూ భక్తుల ఆగ్రహం
తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం వంటి బోనాలను కించపరిచేలా ఈ పాట ఉందని, దేవతను మొక్కినట్టుగా కాకుండా, తిడుతున్నట్టుగా ఉందని, ఇలాంటి పాటను మంగ్లీ ఎలా పాడిందని భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఈ గేయం ఉందని, మంగ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే, ఆ పాటలోని పదాలను మార్చేయాలని స్పష్టం చేస్తున్నారు.