డిశ్చార్జ్ పిటిషన్‌పై మరోమారు వాయిదా కోరిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. రూ. 3 వేల జరిమానా విధించిన సీబీఐ కోర్టు
- ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు
- ఇకపై వాయిదాలు ఉండబోవని స్పష్టం చేసిన కోర్టు
- తదుపరి విచారణలో వాదనలు వినిపించాల్సిందేనని హెచ్చరిక
ఓఎంసీ కేసులో సరిహద్దు వివాదం తేలే వరకు అక్రమ మైనింగ్ కేసు విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినట్టు శ్రీలక్ష్మి తరపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తదుపరి విచారణలో కనుక వాదనలు వినిపించకుంటే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఈ నెల 12కు విచారణను వాయిదా వేశారు.