సెట్స్ పైకి మహేశ్ బాబు కూడా సిద్ధం!
- రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు
- మహేశ్ జోడీగా కీర్తి సురేశ్
- తమన్ బాణీలు ప్రత్యేకం
- సంక్రాంతికి భారీ రిలీజ్
మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉందని ఆమె చెబుతోంది. ఈ మధ్య కాలంలో తాను చేసిన విభిన్నమైన పాత్ర ఇది అనీ, ఈ పాత్ర అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అంటోంది. సుబ్బరాజు .. వెన్నెల కిషోర్ పాత్రలు చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట. ఈ రెండు పాత్రలు నాన్ స్టాప్ గా నవ్విస్తూ ఉంటాయని చెబుతున్నారు. పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న ఈ సినిమాకి, తమన్ బాణీలను సమకూర్చాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.