నేను కేవలం ఆర్టిస్టునే... తప్పు చేసి ఉంటే క్షమాపణ చెబుతా: హైపర్ ఆది
- ఓ కార్యక్రమంలో తెలంగాణను కించపరిచాడంటూ ఆరోపణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి సమాఖ్య
- ఆ స్క్రిప్టు తాను రాయలేదన్న ఆది
- క్షమాపణ చెప్పేందుకు బాధపడనని స్పష్టీకరణ
ఆ టీవీ కార్యక్రమం జరిగే వేళ వేదికపై 20 మంది వరకు నటులు ఉన్నారని, ఆ సమయంలో ఎవరు బతుకమ్మ పాట పాడుతున్నారో, ఎవరు గౌరమ్మ పాట పాడుతున్నారో తెలుసుకోలేమని పేర్కొన్నాడు. తాను పలికిన డైలాగుల్లో తప్పు ఉందని భావిస్తే తనను క్షమించాలని తెలిపాడు. క్షమించాలని అడిగేందుకు తానేమీ బాధపడనని హైపర్ ఆది స్పష్టం చేశాడు.
ఇటీవల ఓ చానల్ లో ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే కార్యక్రమం ఈ వివాదానికి దారితీసినట్టు తెలుస్తోంది.