కన్నడ హీరో యశ్ దాతృత్వం... సినీ కార్మికులకు రూ.1.5 కోట్లు వితరణ
- సినీ పరిశ్రమలపై కరోనా పంజా
- కన్నడ చిత్ర పరిశ్రమ కోసం స్పందించిన యశ్
- 3 వేల మందికి ఒక్కొక్కరికి రూ.5 వేలు
- ఇది చిన్న సాయం మాత్రమేనన్న యశ్
దాదాపు 3 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో వేస్తున్నట్టు యశ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే సమస్యకు ఇది పరిష్కారం అని తాను అనుకోవడంలేదని, ఇది ఒక చిరుసాయం మాత్రమేనని, భవిష్యత్ దిశగా ఆశలు కలిగించే ఓ చిన్న ప్రయత్నం మాత్రమేనని వినమ్రంగా తెలిపారు.